- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ శాసనసభ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. సోమవారం కృష్ణా జలాల వాటాపై సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడీ చర్చ జరిగింది. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుమందు సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఈ విషయాన్ని స్వయంగా సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. మరోవైపు ఇంత కీలకమైన సమావేశాలకు మాజీ CM, విపక్ష నేత KCR హాజరుకాకపోవడాన్ని CM రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు.
చేసిన నిర్వాకమంతా చేసి ఇప్పుడు సమావేశాలకు కేసీఆర్ ఎందుకు రావడం లేదని సీఎం ప్రశ్నించారు. దీనికి బీఆర్ఎస్ నేతలు కూడా స్ట్రాంగ్‌గానే స్పందించారు. ముఖ్యంగా KRMBకి ప్రాజెక్టుల అప్పగింత విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం జరిగింది. అధికారపక్షం ప్రస్తావించిన ప్రతి అంశానికి.. BRS నుంచి కౌంటర్ అదే స్థాయిలో వచ్చింది. ఓ దశలో వ్యక్తిగత విమర్శల సైతం చేసుకున్నారు. కృష్ణానది జలాల విషయంలో ముమ్మాటికీ తెలంగాణకు అన్యాయం చేసింది గత BRS ప్రభుత్వమేని సీఎం రేవంత్ రెడ్డి సహా, కాంగ్రెస్ మంత్రులంతా ముక్తకంఠంతో చెప్పారు.