- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలోను టీడీపీ అధికారంలోకి వస్తుంది: సీఎం చంద్రబాబు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని అన్నారు. ఇక నుంచి ప్రతి నెల రెండో శనివారం,ఆదివారం తెలంగాణ రానున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అలాగే పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టామని.. త్వరలో గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా 15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా చేసుకుని పార్టీలో యువకులకు, బీసీలకు పెద్దపీట వేస్తామని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించక పోవడానికి కారణం చెప్పుకొస్తూ.. సభ్యత్వ నమోదు ప్రక్రియ తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని సీఎం చంద్రబాబు ముఖ్యనేతలతో సమావేశం సమయంలో చెప్పినట్లు తెలుస్తుంది.