- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్ని విభాగాలకు ‘ఆవిర్భావ’ టాస్క్ టెన్షన్!
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభలను గ్రాండ్‌గా నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. కొత్త సచివాలయంలో ఉత్సవాలను సక్సెస్ చేయాలని భావిస్తున్నది. దీనిలో భాగంగా అన్ని విభాగాలకు ఇంటర్నల్ గా ఆదేశాలిచ్చింది. ఎక్కువమంది ఉద్యోగులను వేడుకల్లో భాగస్వామ్యం చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అన్ని విభాగాలకు సర్కార్ టాస్క్‌ను ఇచ్చింది. కొత్త సెక్రటేరియట్‌లోని ఆవిర్భావ సభలో సుమారు 14వేలమందికి సరిపోయేలా ఏర్పాట్లు చేయగా, ఈ సంఖ్యకు ఏ మాత్రం తగ్గకుండా ఉద్యోగులను తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
దీంతో సాధ్యమైనంత ఎక్కువమందిని తరలించాలని అన్ని విభాగాలు సిద్ధం అవుతున్నాయి. ఒక శాఖ మరొక శాఖతో పోటీపడుతూ తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలతో అన్ని శాఖలకు బస్సులను సమకూర్చారు. ఉద్యోగులంతా ఉదయం ఆయా శాఖల కార్యాలయాలకు వచ్చి టిఫిన్ అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులలో కొత్త సెక్రటేరియట్ కు వెళ్లనున్నారు. ఇందుకోసం ప్రతిశాఖలో ఒక టీమ్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. తరలింపు, మళ్లీ కార్యాలయాల వద్ద దింపేవరకు సదరు టీమ్ మానిటరింగ్ చేస్తుందని ఓ శాఖకు చెందిన అధికారి తెలిపారు.
హెల్త్‌లో ఎక్కువ....?
మిగిలిన డిపార్ట్మెంట్లతో పోల్చితే వైద్యారోగ్యశాఖ నుంచి ఎక్కువ మంది ఉద్యోగులను తరలించాలని ఆ శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఉదయం కోఠి క్యాంపస్ ప్రత్యేక బస్సుల్లో సచివాలయానికి వెళ్లనున్నారు. పబ్లిక్‌హెల్త్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలోని ఉద్యోగులందరినీ వేర్వేరు బస్సుల్లో తరలించనున్నారు. ఆవిర్భావ సభకు దాదాపు 3 వేల మందిని తరలించాలని ఆ విభాగం లక్ష్యం పెట్టుకున్నది. దీంతోపాటు విద్యుత్ శాఖ, వెల్ఫేర్ శాఖ, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఆర్అండ్ బీ, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ తదితర శాఖలు కూడా ఎక్కువ మందిని తరలించి, ప్రభుత్వం నుంచి మంచి మార్కులు పొందాలని ప్రయత్నిస్తున్నాయి.
పొలిటికల్ తరహాలో...
ఈ నెల14న నిమ్స్ మాతా,శిశు సంరక్షణ కేంద్రాలకు శంకుస్థాపన, నూతన బిల్డింగ్ ల ఓపెనింగ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ చీఫ్ గెస్టుగా రానున్నారు. అనంతరం ఆఫీస్ ఆవరణలో ప్రత్యేక సభను నిర్వహించనున్నారు. దీనికి 5 వేల మంది ఉద్యోగులను తరలించాలని వైద్యారోగ్యశాఖ లక్ష్యం పెట్టుకున్నది. ఎక్కువమంది ఉద్యోగులను సమీకరించాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. నిమ్స్‌లో రెండు వేల పడకలు ఓపెనింగ్ సభలకు రాజకీయ పార్టీ సభల తరహాలో ఉద్యోగులను తీసుకువెళ్తున్నారని స్వయంగా ఆ విభాగపు స్టాఫ్ విమర్శిస్తున్నారు. కొన్ని శాఖల్లో ఆవిర్భావ వేడుకలకు రాని జాబితాను ప్రభుత్వానికి కూడా పంపిస్తామని కొందరు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. మరి కొన్నిచోట్ల ఏకంగా ప్రమోషన్ల ఫైళ్లు ఆగుతాయని బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. వైద్యారోగ్యశాఖ లో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు.
Also Read: తెలంగాణ ఏర్పడేనాటికి అప్పు రూ.75 వేల కోట్లు.. ఇప్పుడు ఎంతైందో తెలుసా?