- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టెట్ అభ్యర్థులకు టీ-శాట్ గుడ్ న్యూస్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో టెట్ (టీచర్స్ ఎలిజబిలిటీ టెస్ట్)కు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్ష రాసే విధానంలో పలు మెళకువలతో పాటు సలహాలు-సూచనలు అందించడానికి బుధవారం నుండి టీ- షాట్ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు టీ-షాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుండి నాలుగు రోజుల పాటు ఐదు సబ్జెక్టులపై అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీ-షాట్ నిపుణ ఛానల్‌లో ఉదయం 11 నుండి 12 గంటల వరకు గంట పాటు ప్రత్యేక ప్రసారం చేయనున్నట్టు వెల్లడించారు .
15వ తేదీన సైకాలజీ
16న టీచింగ్ మెథడ్స్,
17న తెలుగు
18న ఫిజికల్ సైన్స్, మాథ్స్ సబ్జెలపై కొనసాగే ప్రసారాలు నిపుణ ఛానల్‌తో పాటు టీ-శాట్ విద్యా ఛానల్‌లో మరుసటి రోజు సాయంకాలం ఐదు నుండి ఆరు గంటల వరకు పున:ప్రసారమౌతాయని అయన తెలిపారు. ఇప్పటికే టెట్ అభ్యర్థుల కోసం సుమారు 200 ఎపిసోడ్స్ టీ-షాట్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. అభ్యర్థులు తమ సందేహాలు-సమాధానాల కోసం 040-3540326/726, టోల్ ఫ్రీ నెం.1800 425 4039 నెంబర్లకు కాల్ చేయవచ్చని సీఈవో సూచించారు.