- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్వప్న లోక్ ఫైర్ యాక్సిడెంట్ : మృతుల కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సాయం
by Sathputhe Rajesh |

X
దిశ, నర్సంపేట: సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో మృతి పొందిన వారికి ఒక్కో కుటుంబానికి రూ.50వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయాన్ని వ్యక్తిగతంగా అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఫోన్‌లో ఈ ఘటనపై మాట్లాడారు. అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాలని వారిని కోరినట్లు తెలిపారు.
దుగ్గొండి మండలంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ వెన్నెల, ఖానాపూర్ మండలానికి చెందిన బానోతు శ్రావణి, నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శివ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఓదార్చి, ధైర్యం చెప్పారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలు స్వగ్రామానికి తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.
Next Story