వైన్స్ వద్ద మహిళ అనుమానాస్పద మృతి

by Sathputhe Rajesh |
వైన్స్ వద్ద మహిళ అనుమానాస్పద మృతి
X

దిశ, మెదక్ ప్రతినిధి: మెదక్ బస్టాండ్ సమీపంలో వైన్స్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. స్థానిక బస్టాండ్ సమీపంలో గల దారువాలా వైన్స్ షెట్టర్‌ల ముందు సుమారు 60 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం పడి ఉంది. స్థానికులు గమనించి పోలీస్‌లకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా ఆమె వద్ద ఎలాంటి గుర్తులు లేవు. గుర్తు తెలియని మహిళ మృతదేహంగా కేసు నమోదు చేసుకొని శవాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మహిళ ఎలా మృతి చెందింది అన్నది అనుమానాస్పదం గా మారింది. వైన్స్ వద్ద మృతి చెందడం పై పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

Advertisement

Next Story