- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిబేట్ల విషయంలో యాంకర్ల ప్రవర్తనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ద్వేషపూరిత ప్రసంగాలపై టీవీ ఛానళ్లలో మాట్లాడుతున్నప్పుడు యాంకర్ల బాధ్యత కీలకమైనదని, టీవీలో ద్వేషపూరిత ప్రసంగం ఒకరిని నెమ్మదిగా చంపడం లాంటిదని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ఉత్తరాఖండ్ లో జరిగిన ఓ ఘటనపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషీకేశ్ రాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీడియా, సోషల్ మీడియాలో చాలా ద్వేషపూరిత ప్రసంగాలు వస్తున్నాయని వీటన్నింటిని చూస్తుంటే మన దేశం ఎటువైపు వెళుతోందని సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. ద్వేషపూరిత ప్రసంగాలపై మీడియాకు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. టీవీ చర్చల్లో యాంకర్లకు పెద్ద బాధ్యత ఉంటుందని కానీ కొంత మంది యాంకర్లు అతిథికి కూడా సమయం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించింది. ద్వేషపూరిత వాతావరణం కొనసాగుతున్నప్పుడు కేంద్రం మౌనంగా ఎందుకు ఉంటోందని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి ప్రసంగాల నియంత్రణ కోసం కఠినమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఈ విషయంలో రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తుదుపరి విచారణను నవంబర్ 23కి వాయిదా వేసింది.