- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జేఈఈ ఎంట్రెన్స్‌లో బీసీ గురుకుల విద్యార్థుల విజయకేతనం
by Shiva |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఐఐటీ, ఎన్‌ఐటీలో ప్రవేశం కోసం 2023-24 సంవత్సరంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఎంట్రెన్స్‌లో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో అర్హత సాధించారు. కె.శ్రీనివాస్ 97.51 శాతం మార్కులు సాధించగా, ఈ.వైష్ణవి 96.78 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. 8 మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు 90 పర్సంటైల్ కన్న ఎక్కువ సాధించారు. ఓవరల్‌గా అబ్బాయిల్లో 44 మంది, అమ్మాయిల్లో 28మంది జేఈఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను, అధ్యాపక సిబ్బందిని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల సెక్రటరీ బి.సైదులు అభినందించారు.
Next Story