- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఫోన్లకే ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లు.. డౌన్ లోడ్, పూర్తి వివరాలివే

దిశ, వెబ్ డెస్క్: నేటి(జనవరి 30) నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు జరుగనున్నాయి. అలాగే సెకండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల హాల్ టికెట్లను నేరుగా విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నంబర్లకే పంపించనుంది. ఇప్పటికే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు హాల్ టికెట్లు పంపించింది. త్వరలో రెండవ సంవత్సరం విద్యార్థులకు కూడా పంపనుంది.
విద్యా శాఖ పంపిన లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. డౌన్‌లోడ్ చేసుకునేందుకు సమస్యలు తలెత్తితే కళాశాలకు వచ్చి సమస్య తెలియజేయాలని పేర్కొంది. అయితే, గతంలో కాలేజీలకు హాల్ టికెట్లను పంపించేది. విద్యార్థులు తమ తమ కళాశాలలకు వెళ్లి హాల్ టికెట్లను తీసుకునేవారు. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో పెట్టి డౌన్‌లోడ్ చేసుకోవాలనేవారు. ఇక మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని అధికారులను విద్యా శాఖ ఆదేశించింది.
ఈ విధానం ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షల సమయంలో మరింత సౌకర్యం కల్పించడం జరుగుతోందని విద్యా శాఖ తెలిపింది. ఈ విధానం మొదటిసారి అమలు అవ్వడంతో, అధికారులు విద్యార్థుల మొబైల్ ఫోన్ నంబర్లు సేకరించి, వారు ఇచ్చిన నంబర్లకు లింక్ పంపిస్తున్నారు. హాల్ టికెట్ల పంపిణీ విధానంలో వచ్చిన ఈ మార్పులు, విద్యార్థులకు సమయాన్ని ఆదా చేయడంతో పాటు, విద్యార్థులలో విశ్వాసం, సౌకర్యాన్ని పెంచుతాయని పేర్కొంది. అలాగే ప్రైవేట్ కాలేజీలు పరీక్షల సమయాల్లో పెండింగ్ ఫీజులు పూర్తిగా కడితేనే హాల్ టికెట్లు అందజేస్తామంటూ బెదిరింపులకు పాల్పడకుండా.. ఈ విధానం విద్యార్థులకు పెద్ద ఊరట కలిగించనుంది.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్ ఇదే..
5 మార్చి 2025- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
7 మార్చి 2025- ఇంగ్లీష్ పేపర్-1
11 మార్చి 2025- మాథ్స్ పేపర్ 1ఏ, బోటని పేపర్-1 , పొలిటికల్ సైన్స్ పేపర్-1
13 మార్చి 2025- మ్యాథ్స్ పేపర్ 1బీ , జువాలజి పేపర్ -1, హిస్టరీ పేపర్-1
17 మార్చి 2025- ఫిజిక్స్ పేపర్-1 , ఎకనామిక్స్ పేపర్-1
19 మార్చి 2025- కెమిస్ట్రీ పేపర్-1 , కామర్స్ పేపర్-1
21 మార్చి 2025- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు)
24 మార్చి 2025- మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1
ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ ఇదే..
6 మార్చి 2025- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
10 మార్చి 2025- ఇంగ్లీష్ పేపర్-2
12 మార్చి 2025- మాథ్స్ పేపర్ 2ఏ, బోటని పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
15 మార్చి 2025- మ్యాథ్స్ పేపర్-2బీ, జువాలజి పేపర్-2, హిస్టరీ పేపర్-2
18 మార్చి 2025- ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
20 మార్చి 2025- కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
22 మార్చి 2025- పబ్లిక్ అడ్మినిస్టరేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ 2(బైపీసీ విద్యార్థులకు)
25 మార్చి 2025- మోడ్రన్ ల్యాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2