- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం కేసీఆర్ ను కలిసిన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం.. ఎందుకోసమంటే?
by Javid Pasha |

X
దిశ, వెబ్ డెస్క్: హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్.. ఐశ్వర్య అనే యువతిని పెళ్లి చేసుకోనున్నాడు. ఇటీవలే వారి నిశ్చితార్థ వేడుక చాలా ఘనంగా జరిగింది. ఇక త్వరలోనే హైదరాబాద్ లో వారి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం సీఎం కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ లో జరుగనున్న తన కుమారుని వివాహానికి ఆహ్వానిస్తూ శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును బ్రహ్మానందం కుటుంబ సమేతంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Next Story