‘శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్నాడు..కానీ?’.. తండ్రి భాస్కర్ ఆవేదన

by Jakkula Mamatha |   ( Updated:2024-12-24 16:23:59.0  )
‘శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్నాడు..కానీ?’.. తండ్రి భాస్కర్ ఆవేదన
X

దిశ,వెబ్‌డెస్క్: పుష్పా-2 ది రూల్(Pushpa-2 Movie) ప్రీమియర్ షో(premiere show) సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఏ11గా ఉన్న హీరో అల్లు అర్జున్‌ను(Allu Arjun) నేడు పోలీసులు విచారిస్తున్నారు. అయితే తాజాగా కొడుకు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి పై తండ్రి భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తూ మూస్తున్నాడని శ్రీతేజ్(Sri Tej) తండ్రి భాస్కర్ తెలిపారు. కానీ తనను గుర్తు పట్టే స్థితిలో లేడని వాపోయారు. శ్రీతేజ్ కోలుకునేందుకు మరో 2 నెలలు పట్టే అవకాశం ఉందని వైద్యులు చెప్పారన్నారు. అల్లు అర్జున్ టీమ్ నుంచి ఇప్పటివరకు రూ.10 లక్షలు ఇచ్చారని, వైద్యులతో నిత్యం మాట్లాడి ఆరా తీస్తున్నారని వెల్లడించారు. బన్నీపై కేసు వాపసు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు భాస్కర్ చెప్పారు.

Read More...

Sukumar: సినిమాలు మానేస్తానంటూ సుకుమార్ షాకింగ్ కామెంట్స్.. ‘పుష్ప-2’ ఎఫెక్ట్ అంటున్న నెటిజన్లు! (వీడియో)


Advertisement

Next Story

Most Viewed