Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. త్వరలోనే నిండనున్న భారీ ప్రాజెక్ట్

by Mahesh |   ( Updated:2024-07-25 15:19:58.0  )
Srisailam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. త్వరలోనే నిండనున్న భారీ ప్రాజెక్ట్
X

దిశ, వెబ్ డెస్క్: గత వారం రోజులుగా కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ఎగువన ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో జూరాల డ్యామ్ కు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో వచ్చిన నీరును వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు. అలాగే తుంగభద్రకు కూడా భారీగా వరద వస్తుండటంతో 28 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతుంది. మొత్తం ఎగువ ప్రాంతాల నుంచి 2,18,406 క్యూసెక్కుల వరద ప్రవాహం డ్యాం లోకి చేరుతుంది. అయితే శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 855 అడుగులకు చేరుకుంది. అలాగే ఈ డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 90 టీఎంసీలు నిల్వ ఉంది. అయితే ఎగువ నుంచి వస్తున్న వరద ఇలానే కొనసాగితే రెండు వారాల్లో శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయిలో నిండితే.. గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అలాగే ప్రస్తుతం శ్రీశైలం డ్యాం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తుండగా.. దీని ద్వారా నాగార్జున సాగర్ కు 31,784 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.

Advertisement

Next Story

Most Viewed