CM Revanth : ఉచిత బస్సు ప్రయాణం వినియోగిస్తున్న స్పోర్ట్స్ అమ్మాయిలు.. సీఎం ఆసక్తకిర ట్వీట్

by Ramesh N |
CM Revanth : ఉచిత బస్సు ప్రయాణం వినియోగిస్తున్న స్పోర్ట్స్ అమ్మాయిలు.. సీఎం ఆసక్తకిర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: Free bus travel scheme మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకుని ఈ పిల్లలు గ్రౌండ్‌కు వెళ్ళి చక్కగా గేమ్స్ నేర్చుకుంటున్నారని Madhavarapu Rama laxmi మాధవరపు రమా లక్ష్మీ (టీజీఎస్ఆర్టీసీ కండక్టర్) అనే నెటిజన్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి కామెంట్ పెట్టారు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది.. మీకు ధన్యవాదాలు సార్.. అంటూ వారు బస్సులో దిగిన ఫోటోను సీఎంతో పంచుకున్నారు.

ఈ విషయంపై ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి CM Revanth Reddy గురువారం స్పందించారు. ఆడబిడ్డల ఆకాంక్షలను నెరవేర్చాలన్న సంకల్పంతో Congress party కాంగ్రెస్ పార్టీ “మహాలక్ష్మీ” పథకాన్ని ప్రకటించిందని సీఎం పేర్కొన్నారు. ఈ మహాలక్ష్ములను చూస్తుంటే.. ఆ పథకం ఉద్దేశం నెరవేరుతోందన్న విషయం అర్థమవుతోందన్నారు. చాలా సంతోషం.. ఆ పిల్లలు భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని, వారి లక్ష్యాలను చేరాలని ఆకాంక్షించారు.

Next Story

Most Viewed