- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోడుపై సర్కార్ కొత్త గేమ్.. ! 'డైవర్షన్' ప్లాన్
దిశ, తెలంగాణ బ్యూరో: పోడు భూముల ఇష్యూను డైవర్షన్చేసేందుకు సర్కార్కొత్త గేమ్ కు ప్లాన్ చేసింది. గొత్తి కోయల అంశాన్ని తెర మీదకు తెచ్చింది. ఎన్నికలకు మరో ఏడాది కాలమే ఉండగా రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఆదివాసీ, గొత్తి కోయల మధ్య చిచ్చుకు కుట్ర పన్నింది. వారి పంచాయితీ పెట్టి ఎన్నికల దాకా పోడు భూములపై సాగ దీయాలని భావించింది. అయితే అనుకోకుండానే ఫారెస్ట్ రేంజర్హత్యా ఘటన సర్కార్కు కలిసొచ్చింది. ఇదే సాకుగా చూపిస్తూ గొత్తికోయలను చత్తీస్ గఢ్ తరిమేందుకు పలు జిల్లాల్లో అధికారులు నోటీసులూ ఇస్తున్నారు. భూములపై మరో సర్వే అంటూ గ్రామ స్థాయి ఫారెస్ట్సిబ్బంది ప్రజలకు వివరిస్తున్నారు. వాస్తవానికి పోడు భూములు అంశంలో చాలా చోట్ల ఘర్షణలు ఉన్నాయి. దీంతో హక్కు పత్రాలు అందరికీ ఇవ్వలేని సర్కార్పరిస్థితి. దీంతో పాజిటివ్కంటే నెగెటివ్ పెరిగే ఛాన్స్ఉందని గ్రహించింది. ఘటన అనంతరం డైవర్షన్పాలిటిక్స్ను స్టార్ట్చేసింది.
రాత పూర్వకంగా లేని హామీ..
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల ఎకరాల పోడు భూముల దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి. వీటిలో గ్రామస్థాయిలో కొన్నింటిని మాత్రమే ఎంపిక చేస్తూ వస్తున్నారు. మిగతా అప్లికేషన్లను రిజెక్ట్చేస్తున్నారు. దానికి గల కారణాలను పొందుపరుస్తూ రాత పూర్వకంగా క్లారిటీ ఇవ్వాలని రూల్ ఉంది. కానీ దీన్ని ఫారెస్ట్ఆఫీసర్లు పాటించడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పోడు భూముల పంచాయితీని సర్కార్ ముందుకు తెస్తున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే హక్కు పత్రాలను ఇస్తామని హామీలు ఇస్తున్నది. గెలిచాక మరిచిపోతున్నది. ఇలా 2014, 2018 ఎన్నికల్లోనూ ఇట్లనే చెప్పి.. ఆదివాసీలను మోసగించింది. ఇప్పుడు కూడా సాగదీస్తూ వచ్చే ఎన్నికల్లో గట్టెక్కాలని సర్కార్ యత్నిస్తున్నది.
పార్టీల మద్దతుకు అడుగులు
పోడు భూములపై సర్కార్వైఖరిని ప్రజలకు తెలియజేసేందుకు ఆదివాసీ, అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ అన్ని రాజకీయ పార్టీల మద్దతుకు ప్రయత్నిలు చేస్తు్న్నది. ఇందుకు డిసెంబరు 1న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్టేబుల్సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఇందులో పోడు సమస్య, గొత్తికోయల ఇండ్లు, పరిరక్షణ వంటి వాటిపై తీర్మానం చేయనుంది. పోడు సమస్యను సర్కార్సాగదీస్తున్నదని, ఇందుకోసమే స్థానిక ఆదివాసీ, గొత్తి కోయలకు మధ్య విభేధాలు సృష్టించాలని చూస్తున్నదని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య ఆరోపించారు. ఆదివాసులైన గొత్తికోయలపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదని సూచించారు.
ఇవి కూడా చదవండి : కేసీఆర్ ఎలక్షన్టీమ్ రెడీ? తలమునకలైన సీఎస్ !