పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

by Anjali |
పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఎస్పీ
X

దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. 10 వ తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా తగు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పాఠశాల పరీక్షల పర్యవేక్షణ అధికారితో పాటు పోలీసు అధికారులకు సూచించారు. అదే విధంగా జరుగతున్న పరిణామాల దృష్ట్యా అనవసర చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story