సోనియాగాంధీ బర్త్ డే.. రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్!

by Sathputhe Rajesh |
సోనియాగాంధీ బర్త్ డే.. రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్!
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ నేడు 77వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సోనియాగాంధీకి స్పెషల్ విషెస్ తెలిపారు. ‘తెలంగాణ చరిత్రలో మీ పేరు సువర్ణాక్షర లిఖితం. స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన సంకల్పం మీ సొంతం. తెలంగాణ తల్లి సోనియమ్మకు నాలుగు కోట్ల ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.’అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఇటీవల తెలంగాణ సీఎంగా తనను ప్రకటించినప్పుడు సోనియాతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రధాని మోడీ సైతం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి ట్విట్టర్ వేదికగా బర్త్ విషెస్ తెలిపారు.

Advertisement

Next Story