- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైదరాబాద్ నుంచి వెళ్తున్న ట్రైన్‌లో పొగలు.. భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు
దిశ, వెబ్‌డెస్క్: ఈస్ట్ కోస్ట్ సూపర్ ఫాస్ట్ రైలులో పొగలు వచ్చాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కురవి మండలం గుడ్రాతమడుగు రైల్వే స్టేషన్‌లో ఈస్ట్ కోస్ట్ ట్రైన్‌లో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ట్రైన్ హైదరాబాద్ నుంచి శాలీమర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. పొగలు రావడంతో అరగంటపాటు ట్రైన్ ఆగిపోయింది.
పొగలు రావడంతో ట్రైన్‌ను గుండ్రాతిమడుగు స్టేషన్‌లో లోకోపైలట్ నిపివేశాడు. ఆ తర్వాత ప్రయాణికుల నుంచి సమాచారం అందుకుని వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రైన్‌లో పొగలను అదుపులోకి తీసుకురాగా.. అనంతరం ట్రైన్ బయలుదేరింది. పొగలు రావడానికి ఒక ప్రయాణికుడే కారణమని తెలుస్తోంది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒక ప్రయాణికుడు ట్రైన్ చైన్ లాగి వదిలేశాడు. దీని వల్ల ట్రైన్ కదిలి కొద్దిదూరం వెళ్లిన తర్వాత బ్రేకులు పట్టేయడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. చైన్ లాగిన ప్రయాణికుడు ఎవరనేది తెలుసుకునేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.