ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

by Ramesh Goud |
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం (SLBC Tunnel Incident) పై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) ఆమ్రాబాద్ మండలం (Amrabad Mandal)లో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం (Srishailam Left Canal Tunnel) కుప్పకూలింది. మట్టి కూలడంతో సొరంగంలో పనికి వెళ్లిన కార్మికులు (Workers) మట్టిలో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఇప్పటికే సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు (Juapply Krishna Rao) తో పాటు డీఐజీ (DGP), ఐజీ (IG), ఇరిగేషన్ ఉన్నతాధికారులు (Irrigation Officials) హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ (Collector), ఎస్పీ (SP)తో పాటు అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎం ఆదేశించారు. అంతేగాక బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఇక ఎస్‌డీఆర్ఎఫ్ (NSRF), ఎన్ఆర్డీఎఫ్ బృందాలు (NRDF Teams) కాసేపట్లో ప్రమాద స్థలికి చేరుకోనున్నాయని, సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అంతకముందు సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ ఘటనపై స్పందిస్తూ.. దిగ్భ్రాంతి (Shocking) వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed