రాముడు ఎంపీనో ఎమ్మెల్యేనో కాదు.. కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2024-04-23 07:30:37.0  )
రాముడు ఎంపీనో ఎమ్మెల్యేనో కాదు.. కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముదు రేవంత్ రెడ్డి మోసం పార్ట్-1 చూపించారని ఎంపీ ఎన్నికలు రాగాజనే మోసం పార్ట్- 2 పేరుతో ఓటు అడగడానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికలు రాగానే పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామని మరోసారి మోసాని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మంగళవారం చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ప్రజలు ఒకసారి మోసపోతే అది నాయకుల తప్పు అవుతుందని రెండోసారి కూడా మోసపోతే అది ప్రజలది తప్పు అవుతుందన్నారు. రెండోసారి మోసపోదామా అని ప్రశ్నించారు.

బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. పదేళ్లుగా బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పకుండా కేవలం జైశ్రీరామ్ అంటోందని శ్రీరాముడు బీజేపీ ఎమ్మెల్యేనో, ఎంపీనో కాదన్నారు. రాముడు అందరి వాడన్నారు. ఒక వైపు కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల అబద్ధం ఉంటే మరో వైపు బీఆర్ఎస్ పదేళ్ల పాలన ఫలాలు మీ కళ్ల ముందు ఉన్నాయన్నారు. 111 జీవో గురించి అన్ని పార్టీలు మాట్లాడాయని కానీ దాన్ని ఎత్తివేసిన ఘనత కేసీఆర్ దన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ బలహీన వర్గాల బాహుబలి అని, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఐక్యం అయి కాసానిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story