- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bird flu chicken : షాకింగ్...అక్కంపల్లి రిజర్వాయర్ లో బర్డ్ ఫ్లూ కోళ్ల కళేబరాలు

దిశ, వెబ్ డెస్క్ : ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ(Bird flu) వైరస్ విజృంభిస్తూ పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతూ ఫౌల్ట్రీ పరిశ్రమ భారీ నష్టాలకు గురవుతున్న సంగతి అందరికి తెలిసిందే. బర్డ్ ఫ్లూ భయంతో కోడి మాంసం, గుడ్లు తినడానికి కూడా ప్రజలు జంకుతున్నారు. ఈ పరిస్థితులలో కొందరు బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను ఆనాలోచితంగా తాగునీటి రిజర్వాయర్ లో పడేయటం కలకలం రేపింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(Akkampalli Balancing Reservoir)లో చోటుచేసుకుంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా(Nalgonda District)లోని 600కుపైగా గ్రామాలతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు కృష్ణా తాగునీరు సరఫరా చేసే పీఏ పల్లి మండలం(PA Palli Mandal)లోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో చనిపోయిన 80కి పైగా కోళ్లను పడవేశారు. రిజర్వాయర్ లో పెద్ద మొత్తంలో చనిపోయిన కోళ్లు వేశారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. అసలే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో రిజర్వాయర్ లో మృతి చెందిన కోళ్లు పారవేసిన ఘటన ఆందోళనకు గురిచేస్తుంది.
ఈ సమాచారం అందుకున్న అధికారులు వెంటనే శుక్రవారం రిజర్వాయర్ ను సందర్శించారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి(RDO Ramana Reddy) రిజర్వాయర్ ను పరిశీలించారు. రిజర్వాయర్ వెనక జలాల్లో దాదాపు 80 వరకు చనిపోయిన కోళ్లు లభ్యం అయ్యాయి. వీటిని స్థానిక రెవిన్యూ సిబ్బందితో బయటికి తీసి రిజర్వాయర్ మొత్తం పరిశీలిస్తున్నారు. రిజర్వాయర్ లో చనిపోయిన కోళ్లను ఎవరు వేశారు అనే కోణంలో విచారణ (Investigation)చేపడుతున్నామని ఆర్డీఓ తెలిపారు.