క్రీడారంగా చరిత్రలో సువర్ణ అధ్యాయం

by Gantepaka Srikanth |
క్రీడారంగా చరిత్రలో సువర్ణ అధ్యాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌లో క్రీడారంగానికి పెద్దపీట వేశారని, క్రీడారంగ చరిత్రలో రూ.326 కోట్లు కేటాయింపు సువర్ణ అధ్యాయనం అని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్‌) చైర్మన్‌ కే. శివసేనారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గానీ క్రీడల అభివృద్ధి సంక్షేమానికి ఇంత మొత్తంలో నిధులు ఏనాడూ కేటాయించలేదన్నారు. క్రీడారంగానికి అధిక నిధులు కేటాయించినందుకు శుక్రవారం ఎల్బీ స్టేడియంలో క్రీడాకారులు, క్రీడాభిమానులు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌తో అంచలంచలుగా అన్ని క్రీడా విభాగాల్లో అభివృద్ధి సాధించే విధంగా ముందుకు వెళ్తామన్నారు. అందరితో సమగ్రంగా చర్చించి పటిష్టమైన ప్రణాళికతో, పకడ్బందీ విధానాలతో ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాట్స్‌ ఉపసంచాలకురాలు అనురాధ, చంద్రారెడ్డి రవీందర్, సుజాత, సూర్యలత, ఇంజినీర్ అశోక్ కుమార్, స్టేడియాల అడ్మినిస్ట్రేటర్లు, కోచులు స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed