- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్వార్థ రాజకీయాలు చేస్తే ఇలాంటి తీర్పే ఇస్తారు: షర్మిల
by Mahesh |

X
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ మత రాజకీయాలకు, బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు చెంపపెట్టులా కర్ణాటక ఎన్నికల ఫలితాలు నిలిచాయని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఆదివారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రజలను అమాయకులను చేసి, స్వార్థ రాజకీయాలకు పాల్పడితే ఇలాంటి తీర్పే వెలువడుతుందని ఆమె మండిపడ్డారు. కులం, మతం, డబ్బు, అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని కొన లేరనే విషయాన్ని కర్ణాటక ఎన్నికలు చాటిచెప్పాయన్నారు. నియంత పాలనను గద్దె దించేందుకు తెలంగాణ సమాజం సైతం ఎదురుచూస్తోందని ఆమె ట్వీట్ చేశారు.
Next Story