ధరణి సమస్యలపై సీఎం కేసీఆర్‌కు షర్మిల బహిరంగ లేఖ

by Nagaya |   ( Updated:2023-01-21 14:38:34.0  )
ధరణి సమస్యలపై సీఎం కేసీఆర్‌కు షర్మిల బహిరంగ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ధరణి సమస్యలపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో భూరికార్డుల ప్రక్షాళనతో పాటు డిజిటలైజేషన్ చేస్తామని తీసుకువచ్చిన ధరణి వెబ్ సైట్ రైతులకు, భూ యజమానులకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు. మీరు చేసిన తప్పులకు రైతులు సామాన్యులు బలి అవుతున్నారని బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి సమస్యల కారణంగా భూ సమస్యలు పరిష్కారం కాక వ్యవసాయాన్ని వదిలి రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు 22 లక్షల మంది ధరణి బాధితులు ఉన్నారని, సమస్య పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పినా వాటి జాడ లేదని మండిపడ్డారు. ధరణిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న కబ్జాలకు అంతులేకండా పోయిందని ఆరోపించారు.

14 లక్షల ఎకరాల లావాణి పట్టా భూములను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని, ధరణి వెబ్ సైట్2లో లక్షలాది సర్వే నెంబర్లు కనిపించకుండా పోయాయన్నారు. దీంతో రైతులంతా మీసేవా కేంద్రాలు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ధరణి స్లాట్ బుక్ చేసుకుని రద్దు చేసుకుంటే ఆ సొమ్ము వెనక్కి రావడం లేదని ప్రజల సొమ్ముతో తమరు ఖజానా నింపుకుంటున్నారు తప్పితే తిరిగి చెల్లించాలనే సోయి లేదు. ధరణి పేరుతో రెవెన్యూ కోర్టులు రద్దు చేశారు. మీ ప్రభుత్వం తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. నిజంగానే మీది రైతు ప్రభుత్వమే అయితే ఇకనైనా మీరు మేలుకొని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed