పనికిమాలిన ముఖ్యమంత్రి ఉండి ఎందుకు..? కేసీఆర్‌పై షర్మిల ఫైర్

by Satheesh |   ( Updated:2023-01-14 14:44:21.0  )
పనికిమాలిన ముఖ్యమంత్రి ఉండి ఎందుకు..? కేసీఆర్‌పై షర్మిల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. మలక్ పేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మరణాలపై శనివారం సోషల్ మీడియా వేదికగా షర్మిల స్పందించారు. జ్వరం వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి, కంటి నొప్పి వస్తే ఢిల్లీకి వెళ్లే కేసీఆర్‌కు ప్రజల ప్రాణాలు అంటే మాత్రం లెక్క లేదని ఫైర్ అయ్యారు. మొన్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై నలుగురు మహిళలు మృతి చెందితే, నిన్న ప్రసవానికి వచ్చిన ఇద్దరి ప్రాణాలు పోయాయన్నారు. పేదలకు సరైన వైద్యం అందించని పనికిమాలిన ముఖ్యమంత్రి ఉండి ఎందుకు? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మలక్ పేట ఘటనలో బాలింతల మరణాలు ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు.

Read more:

తండ్రిని అడ్డుపెట్టుకునే తాను మంత్రిని కాలే: కేటీఆర్‌పై కిషన్ రెడ్డి ఫైర్

Advertisement

Next Story

Most Viewed