కేటీఆర్‌పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు

by Nagaya |   ( Updated:2022-12-11 16:35:24.0  )
కేటీఆర్‌పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్‌ను సీఎంను చేయాల్సి వస్తే గతంలో కేసీఆర్‌ను ఎలాగైతే చేశామో అలాగే బాజాప్తా ముఖ్యమంత్రిని చేస్తామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్సీ కవిత నివాసం సమీపంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం ఉద్యమించి సాధించామని, అద్భుతంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందరం పాలునీళ్లలాగా కలిసి డెవలప్ చేసుకుంటున్నామన్నారు. పదవుల ఆశతో కాదన్నారు. పదవుల కోసం ఆశించి మేము మాకు ఉన్న విలువలకు తూట్లు పొడిచే ప్రయత్నం చేయబోమని స్పష్టం చేశారు. బండి సంజయ్ లాంటివారు ఎవరు మోరపెట్టుకున్నా ఎవరు కాళ్ల దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డా కేసీఆర్‌ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని వెల్లడించారు.

Next Story

Most Viewed