- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Revanth: క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన దేశంలో ఏ రాష్ట్రానికైనా ఉందా? అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. స్వరాష్ట్ర సాధనలో విద్యార్థులు ఏ లక్ష్యం కోసమైతే ప్రాణత్యాగం చేశారో.. ఆ లక్ష్య సాధనలో భాగంగా తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. ఇందులో ఒక్క తల తగ్గినా తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని సంచలన ప్రకటన చేశారు. గురువారం ప్రజాపాలన - విజయోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రజాపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా రవాణాశాఖ సిబ్బంది సాధించిన విజయాలను గుర్తు చేయాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు.
అందులో ముఖ్యంగా ఆర్టీసీ(RTC)లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని.. అది ఆర్టీసీని పునరుజ్జీవింప చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ అయినా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న నేనైనా బాధ్యతాయుతంగా రవాణా కార్మికుల ఆకాంక్షలను గౌరవించాల్సిందే అని తెలిపారు. గత పదేళ్ల పాలనలో ఆర్టీసీ కార్మికులు చనిపోయినా ప్రభుత్వం నుంచి పరామర్శించిన దాఖలాలు లేవని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతీ ఆడబిడ్డ ప్రతీ నెలా 5 నుంచి 7 వేలు ఆదా చేయగలుగుతున్నారని అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్లు పారిపోతే.. కోర్టుల్లో కేసులు పరిష్కరించి మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని అన్నారు.