NMDC సీఎండీగా ఎన్.శ్రీధర్

by Javid Pasha |   ( Updated:2023-03-19 10:13:08.0  )
NMDC సీఎండీగా ఎన్.శ్రీధర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌ సీఎండీగా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్.శ్రీధర్‌ నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సీఎండీగా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన పేరును సిఫార్సు చేస్తూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ శాఖ ఆధ్వరంలోని పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలెక్షన్‌ బోర్డు (PESB) నిర్ణయం తీసుకుంది. ఎన్ఎండీసీ సీఎండీ పదవి కోసం మొత్తం 7 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు దరఖాస్తు చేసుకోగా.. వారందరికీ ఇవాళ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించారు.

చివరికి ఎన్‌ఎండీసీ సీఎండీగా శ్రీధర్‌ పేరును సిఫార్సు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. పీఈఎస్బీ తన సిఫార్సును కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది. అక్కడి నుంచి కేంద్ర కేబినెట్ ద్వారా ప్రధాని వద్దకు ఈ ఫైలు చేరుతుంది. ప్రధాని మోడీ సంతకం చేయడంతో అధికారికంగా అపాయింట్‌మెంట్‌ ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా శ్రీధర్ ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.

Advertisement

Next Story

Most Viewed