ఎంపీ పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తా: కేసీఆర్‌కు మల్లు రవి సంచలన సవాల్

by Shiva |   ( Updated:2025-04-28 08:56:04.0  )
ఎంపీ పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తా: కేసీఆర్‌కు మల్లు రవి సంచలన సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండ జిల్లా (Hanmakonda) ఎల్కతుర్తి (Elkaturthi)లో నిర్వహించిన బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభలో అధికార కాంగ్రెస్‌పై కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్యలకు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) ధీటుగా బదులిచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ (Upper Flap) అయిందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ ఫథకాలు గడపగడపకు చేరుతున్నాయని, వాటితో ప్రజలకు సంతృప్తికరంగా ఉన్నారని తెలిపారు.

రాష్ట్రంలో పదేళ్ల పాటు కేసీఆర్ నియంతృత్వ పాలనను కొనసాగించారని.. ఆ విషయం బీఆర్ఎస్‌లో మంత్రులుగా పనిచేసిన వాళ్లకు తెలియదా.. అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ (KCR)ది మాటల ప్రభుత్వమని.. కాంగ్రెస్‌ది చేతల ప్రభుత్వమని అన్నారు. స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో నేడు ప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందని తెలిపారు. కేసీఆర్ పాలమూరు ప్రాజెక్ట్ (Palamulru Project) పనులను 80 శాతం పూర్తి చేశారని నిరూపిస్తే.. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తానని కేసీఆర్‌కు ఎంపీ మల్లు రవి సంచలన సవాల్ విసిరారు.


Advertisement
Next Story

Most Viewed