కవిత తన తండ్రి కేసీఆర్‌ను అప్పుడు ఎందుకు ప్రశ్నించలే..? మల్లు రవి

by Satheesh |   ( Updated:2024-02-03 15:37:44.0  )
కవిత తన తండ్రి కేసీఆర్‌ను అప్పుడు ఎందుకు ప్రశ్నించలే..? మల్లు రవి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ముందుకు సాగుతుందని ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి పేర్కొన్నారు. శనివారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రంగాల్లోనూ సీఎం సమన్యాయం చూపిస్తున్నారన్నారు. సీఎం ఆఫీస్ నుంచి హెచ్‌వోడీల కార్యాలయాల వరకు సమన్యాయం జరుగుతుందన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లకూ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులకు పెద్ద పీఠ వేస్తున్నామన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు నిర్మాణాత్మక విమర్శలు చేస్తే, స్వాగతిస్తామన్నారు. కానీ ప్రతిపక్షాల హోదా ఉన్నదని అధికార పక్షంపై కావాలని విమర్శలు చేయడం సరికదన్నారు.

ఇక పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకు పూలే గుర్తురాలేదా? ప్రజభవన్‌కు పూలే పేరు పెట్టిన తర్వాత గుర్తొచ్చిందా? ఐదేళ్లు మహిళలకు కేబినెట్‌లో అవకాశం ఇవ్వనప్పుడు కేసీఆర్‌ను కవిత ఎందుకు ప్రశ్నించలేదు..? అంటూ ఫైర్ అయ్యారు. పూలే ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కేసీఆర్ పరిపాలన చేశారన్నారు. మహిళలకు, బీసీలకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారన్నారు. ఇక ప్రజాపాలనలో కోటికి పైగా అప్లికేషన్లు వచ్చాయని, కంప్యూటరైజ్డ్ డేటా ఎంట్రీ పూర్తయిందన్నారు. త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ బండి సుధాకర్ గౌడ్, చరణ్​కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story