- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Setirical Add: దేశంలోనే బెస్ట్ పొలిటికల్ యాడ్.. సోషల్ మీడియాలో కమలనాథుల సరికొత్త ట్రెండ్ (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడటంతో ఆయన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి బీజేపీకి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ INDIA కూటమి పేరుతో ప్రజల ముందుకు వెళ్తోంది. ఇక కమలనాథులు ‘అబ్ కీ బార్.. 400 పార్’ నినాదంతో గత పదేళ్లు దేశంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. ప్రచారం దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీపై సీజన్‌ను బట్టి సెటైరికల్ ట్వీట్లతో విరుచుకుపడుతోంది.
తాజాగా, వేసవిని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికలకు అనుగుణంగా ఓ బ్రాండ్ సంబంధించిన యాడ్‌నే పేరడీగా చేస్తూ ఆ పార్టీ బెస్ట్ పొలిటికల్ యాడ్‌ను రూపొందించింది. ఆ వీడియోలో ఓ పార్క్‌లో చిన్నారులంతా క్రికెట్ ఆడుతుంటారు. ఈ క్రమంలో పైన ఉన్న సూర్యుడు కాంగ్రెస్ రూపంలో వచ్చి చిన్నారల ఎనర్జీని డ్రిండ్ రూపంలో తాగేస్తుంటాడు. వెంటనే బీజేపీ రూపంలో ఉన్న ఓ గ్లాస్ ఎనర్జీ డ్రింక్ చిన్నారులు తీసుకుంటారు. ఇక ఎక్కడ లేని బలం వచ్చి ఆ పిల్లాడు సిక్స్ బాదితే ఆ బాల్ కాంగ్రెస్ రూపంలో ఉన్న సూర్యుడికి తగిలి అక్కడి నుంచి పరార్ అయిపోతాడు. ప్రస్తుతం అందుకు సంబంధించి యాడ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వీడియో చూసిన వారు యాడ్ భలే చేశారే.. అంటూ సెటైర్లు వేస్తున్నారు.
దేశంలోనే ఉత్తమ రాజకీయ ప్రకటన 🔥🔥😂🤣😂 pic.twitter.com/3AK9JLqaa7
— CHALLA VENU GOPAL YADAV (నేను మోదీ గారి కుటుంబం) (@VENUYADAV4BJP) April 7, 2024