అధికార పార్టీ సర్పంచ్ అవమానించాడని.. ఫీల్డ్ అసిస్టెంట్ భార్య సూసైడ్ అటెంప్ట్

by Sathputhe Rajesh |
అధికార పార్టీ సర్పంచ్ అవమానించాడని.. ఫీల్డ్ అసిస్టెంట్ భార్య సూసైడ్ అటెంప్ట్
X

దిశ, తలకొండపల్లి : సర్పంచ్ అవమానించడని ఫీల్డ్ అసిస్టెంట్ భార్య సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ ఘటన తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. 4 రోజుల క్రితం గ్రామంలోని కొంతమంది రైతుల పొలాల వద్ద ఉపాధి హామీ కూలీలు లేబర్ పనులు చేస్తున్నారు. పుష్పలత, పద్మమ్మతో పాటు మరి కొంతమంది మహిళలను స్థానిక సర్పంచ్ చెవిటి రమేష్, అతని తల్లి కిష్టమ్మలు అక్కడికి వెళ్లి కూలీలతో దురుసుగా ప్రవర్తించి నానా దుర్భషలాడారు. వారితో గొడవకు దిగి కూలీలను గాయపరిచారని గ్రామస్తులు పేర్కొన్నారు.

మరసటి రోజు పుష్పలత అనే మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే రోజు కూలీలందరూ ఎంపీడీవో కార్యాలయంలో ధర్నా చేసి ఎంపీడీవో తో పాటు ఏపీవోకు కూడా వినతి పత్రాలు అందించారు. కాగా ఆ ఘటన మర్చిపోకముందే మళ్లీ ఆదివారం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ జంగయ్య భార్య పద్మను సర్పంచ్ అవమానించడంతో మనస్థాపానికి గురై పద్మమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు పద్మమను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వైద్యులు మహిళకు చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం పద్మమ్మ అపస్మారక స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. సర్పంచ్ అధికార పార్టీ చెందిన వాడు కాబట్టే మా గోడును ఎవరు పట్టించుకోవడంలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ నుంచి మాకు ప్రాణహాని ఉందని అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ భార్య పద్మమ్మ చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న తలకొండపల్లి ఏపీఓ కృష్ణ సోమవారం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి జరిగిన సంఘటన విషయాలను అడిగి తెలుసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed