- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్సెక్కి.. చుక్కేసి.. ఎంజాయ్..! మేడారం జాతర బస్సుల్లో వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: సమ్మక్క సారక్కల మేడారం మహా జాతర వైభవంగా సాగుతోంది. 4వ రోజు అమ్మవార్లను దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే మేడారం జాతరకు టీఎస్ ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అయితే ‘సమ్మక్క సారక్క జాతర ఆర్టీసీ బస్సులో మందేసిన ప్రయాణికులు’ అని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. జర్నీలోనే మహిళలు ఉండగానే ఆ బస్సులో కొందరు కింద, సీట్లపై కూర్చుని మగవారు మద్యం సేవిస్తున్నారు. ఈ వీడియో వైరల్ కాగా నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. మరోవైపు టీఎస్ ఆర్టీసీ, పోలీసులకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు.
పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో తాగడంపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తే.. మరికొందరు ఇది తెలంగాణ సంప్రదాయం అని సెటైర్లు వేస్తున్నారు. ‘చూడండి సార్.. మన ఆర్టీసీ బస్సు ఎంత మందికి, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో? ఈ రకమైన సౌలతులు ఇంతవరకు ఎవరూ చూడకుండొచ్చు’ అని ఓ నెటిజన్ టీఎస్ఆర్టీసీకి ట్యాగ్ చేశారు. తెలంగాణలో మందు తాగడం ఒక మామూలు విషయమని మరో నెటిజన్ రాసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సును బార్ షాప్ చేసినట్టు ఉందని మరో నెటిజన్ విమర్శించారు.