- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిషన్ రెడ్డికి రష్యా ప్రభుత్వం ఆహ్వానం
దిశ, తెలంగాణ బ్యూరో : రష్యా రాజధాని మాస్కోలో వచ్చే ఏడాది జరగనున్న ‘4వ లెట్స్ ట్రావెల్ రష్యా టూరిజం ఫోరం’ సదస్సుకు హాజరు కావాలంటూ ఆ దేశ ప్రభుత్వం భారత సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖమంత్రి జి.కిషన్ రెడ్డికి ఆహ్వానం పంపింది. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే ఈ సదస్సుకు రావాలంటూ ఆ దేశ ఆర్థిక శాఖ సహాయ మంత్రి దిమిత్రి వఖ్రుకోవ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. భారత్-రష్యా మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక, పర్యాటక బంధాన్ని వఖ్రుకోవ్ గుర్తుచేస్తూ.. పర్యాటక, వ్యాపార రంగాల్లో భారతదేశం సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఇదొక మంచి వేదిక అని తెలిపారు. అందుకే ఈ కార్యక్రమంలో వ్యక్తిగతంగా పాల్గొనాలని కిషన్ రెడ్డిని కోరారు. ఈ వేదిక ద్వారా భారతదేశ పర్యాటక, సాంస్కృతిక సామర్థ్యాన్ని, సంప్రదాయాలను రష్యా పర్యాటకులకు తెలియజేసేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.