- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎటుపోతుందీ సమాజం.. కామారెడ్డి ఘటనపై సజ్జనార్ ఎమోషనల్
దిశ, డైనమిక్ బ్యూరో: కామారెడ్డి జిల్లాలో ఒక తల్లి చనిపోతే, ఆస్పత్రి నుంచి మృతదేహం తీసుకెళ్లేందుకు కన్న కూతుర్లు ఇష్టపడకపోగా.. కనీసం తల్లిని చివరిచూపు చూడడానికి కూడా రాలేదు. పైగా ఆ తల్లి బిచ్చమెత్తుకొని రూ.1.10 లక్షలు పోగేస్తే.. ఆ డబ్బులు ఇప్పిస్తేనే అంత్యక్రియలు చేస్తామని వారు తెలిపారు. ఈ ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జానార్ ట్విట్టర్ వేదికగా సోమవారం స్పందించారు. తల్లిదండ్రుల గురించి ఇలాంటి వార్తలు చదవాల్సి రావడం బాధాకరమన్నారు.
కన్న కూతుర్లే మానవత్వాన్ని మరిచి ఇలా ప్రవర్తించడం దురదృష్టకరమని తెలిపారు. మన ఎదుగుదలకు సోపానం వేసిన తల్లిదండ్రులకు మనమిచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ‘‘ఇకనైనా మారుదాం. మన ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులను ఆదరిద్దాం!’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ ఘటనపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి కూతుళ్లు, కొడుకులు ఉన్నా.. చనిపోయిన ఒక్కటే అంటూ ఫైర్ అయ్యారు. డబ్బుకు ఇచ్చే విలువ బందాలకు, బంధుత్వాలకు ఇవ్వడం లేదని నెటిజన్స్ ఘటనపై కామెంట్స్ చేస్తున్నారు.
ఎటుపోతోందీ సమాజం!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 8, 2023
తల్లిదండ్రుల గురించి ఇలాంటి వార్తలు చదవాల్సి రావడం బాధాకరం. కన్న కూతుర్లే మానవత్వాన్ని మరిచి ఇలా ప్రవర్తించడం దురదృష్టకరం. మన ఎదుగుదలకు సోపానం వేసిన తల్లిదండ్రులకు మనమిచ్చే గౌరవం ఇదేనా? ఇకనైనా మారుదాం. మన ఉన్నతికి కారణమైన త… pic.twitter.com/GeF0ah6fBq