- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కొడుకు పరీక్ష కోసం లీవ్ అడిగితే ఇవ్వలేదని.. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని ఆర్టీసీలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది కొడుకు పరీక్ష కోసం సెలవు అడిగితే ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. దేవరకొండ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న శంకర్ నాయక్ తన కుమారుడికి ఆదివారం రోజు పరీక్ష ఉందని అడగగా డీఎం రాజీవ్ ప్రేమ్ కుమార్ నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన శంకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. సెలవు ఇవ్వలేదనే మనస్థాపంతో ఇలా చేసుకున్నాడా లేదా మరేదైనా కారణం ఉందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఆర్టీసీ డ్రైవర్ తన చావుకు వీరే కారణమంటూ.. ఓ వీడియోను విడుదల చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.