Mahesh Kumar Goud: కేటీఆర్ అరెస్టుపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్

by Prasad Jukanti |
Mahesh Kumar Goud: కేటీఆర్ అరెస్టుపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేసీఆర్, కేటీఆర్ పగటి కలలు మానుకోవాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) హెచ్చరించారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన సన్న బియ్యం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ (KCR) ప్రమేయంతోనే పెద్ద ఎత్తున రైస్ స్కాం జరిగిందని కేసీఆర్ కుటుంబ సభ్యులు దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం గా మార్చి ఎగుమతి చేసిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా సన్న బియ్యం పంపిణీ చేపట్టామన్నారు. 15 నెలల ప్రజాపాలనలో మార్పు చూపించామని ప్రజల ఆకాంక్షలు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతున్నదన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేశామని ధరణితో విసిగి వేసారిన ప్రజలకు భూభారతి తో మోక్షం దక్కనుందన్నారు.

కేసీఆర్ ఆరెస్టు కావాల్సిందే:

తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేటీఆర్ అరెస్టు (KTR arrest) కావాల్సిందేనని కేసిఆర్ కుటుంబం ఆర్ధిక దోపిడీ చూసి భయపడి కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని హాట్ కామెంట్స్ చేశారు. ఆరు గ్యారెంటీల తో పాటు ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా మరికొన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని సామాజిక న్యాయానికి ఛాంపియన్ రాహుల్ గాంధీ అన్నారు. రేపు నోవాటెల్ లో సీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నామని ఈ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు. మంత్రి వర్గ విస్తరణపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తిగతం అని కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛకు కొదవలేదన్నారు. మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుందన్నారు.



Next Story

Most Viewed