Cyber Crime: సైబర్‌ క్రైమ్‌ బాధితులకు రూ.22 లక్షలు రిఫండ్‌..

by Ramesh N |
Cyber Crime: సైబర్‌ క్రైమ్‌ బాధితులకు రూ.22 లక్షలు రిఫండ్‌..
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరాల (Cyber Crime) బారిన పడి డబ్బు కోల్పోయిన బాధితులకు (Cyber Crimes Police) తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అండగా నిలుస్తున్నారు. తాజాగా వివిధ కేసుల్లో మోసపోయిన బాధితులకు (HYD Cyber Crime Police) హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నగదు రీఫండ్ చేయించారు. ఐదు కేసుల్లో బాధితులకు దాదాపు రూ.22 లక్షల నగదును తిరిగి అప్పగించింది. ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఉందని చెప్పి ఓ బాధితుడు నుంచి దాదాపు రూ.10 లక్షలు కాజేసిన సైబర్ నేరాగాళ్లు.. బాధితుడికి రూ.1.51 లక్షలు పోలీసులు రికవరీ చేయించారు.

కాగా, దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు సైబర్ నేరాలకు గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. దేశంలోనే సైబర్‌ నేరాల్లో తెలంగాణ టాప్‌-5లో ఉన్నట్లు ఇటీవలి ‘తెలంగాణ సైబర్‌ నేరాల వార్షిక నివేదిక’ చెబుతోంది. ఈ క్రమంలోనే సైబర్ నేరాలకు గురికాకుండా ప్రజలకు తెలంగాణ పోలీసులు ఎప్పుడు అవగాహన కల్పిస్తూ ఉన్నారు.

Next Story