'రూ. 2000 నోట్లు తీసుకొనబడవు'

by Sathputhe Rajesh |
రూ. 2000 నోట్లు తీసుకొనబడవు
X

దిశ, డైనమిక్ బ్యూరో : నగరంలో ఓ మిఠాయి కొట్టు ముందు రూ. 2వేల నోటుకు సంబంధించిన ఓ నోటీస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ ప్రముఖ స్వీట్ షాప్ ముందు 'ప్రస్తుతం మేం రూ.2 వేల నోట్లను తీసుకోవడంలేదు' అంటూ ఓ నోటీస్ బోర్డును ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై కస్టమర్లు ఫోటోలు తీసీ సోషల్ మీడియాలో ఆర్బీఐని ట్యాగ్ చేస్తూ కంప్లైంట్లు చేస్తున్నారు.

కాగా, నోట్ల రద్దు తర్వాత కొత్తగా తీసుకువచ్చిన రూ. 2000 నోట్లపై ఎలాంటి నిషేధం లేదని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ అధికారులు చెబుతున్నప్పటికీ పలు వ్యాపారసంస్థలు దానికి విరుద్ధంగా ప్రవర్తించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు, 'చిల్లర సమస్యతో ఈ విధంగా బోర్డు ఏర్పాటు చేసి ఉంటారు కావచ్చు, లేక ఫేక్ నోట్లు వచ్చాయోమో అందుకే ఇలా చేశారు కావచ్చు'అంటూ నెటిజన్లు విభిన్న రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story