- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ మానసిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి సెటైర్
దిశ, డైనమిక్ బ్యూరో : రిజర్వేషన్ రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఏదోరకంగా 400 సీట్లు గెలిచి రాజ్యాంగ సూత్రం మీద దాడి చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు అవుతుందని, ఆలోపు దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసి హిందూ దేశంగా ప్రకటించడం ఆర్ఎస్ఎస్ విధానం అని అన్నారు. దీన్ని అమలు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లపై మోడీ, అమిత్ షా సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ చెప్పిందే.. ఆర్ఎస్ఎస్ విధానం..
రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా వంటి బీజేపీ నేతలు తెలంగాణకే వచ్చి బహిరంగంగా చెబుతుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం రిజర్వేషన్లు రద్దు చేసే కుట్రపై నోరు మెదపడం లేదన్నారు. గతంలో ఆయన రాజ్యాంగాన్ని మార్చి రాయాలని చెప్పారని, ఇదే ఆర్ఎస్ఎస్ విధానమని అన్నారు. కేసీఆర్ నిజంగా బీజేపీ విధానానికి ప్రభావితం అయ్యారా? లేక జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసం రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నారా? అని నిలదీశారు.
మల్లారెడ్డిని సస్పెండ్ చేయండి..
మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి గెలుస్తున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బహిరంగంగా చెప్పాడని, మరి బీజేపీతో నిజంగా వైరం ఉంటే మల్లారెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్‌లో భోజనం చేస్తుండగా కరెంట్ పోయిందన్న కేసీఆర్ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. ‘కేసీఆర్ బకాసురుడివా? రోజంతా తింటున్నావా?’ అని ప్రశ్నించారు.
కేసీఆర్ మానసిక పరిస్థితి బాగోలేదు..
కేసీఆర్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవద్దని, ప్రస్తుతం ఆయన మానసికంగా కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటున్నారని సీఎం అన్నారు. అధికారం కోల్పోయాక ఇంట, బయట ఉన్న పరిస్థితులు, పిలిచినా ఎవరూ పలకడంలేదని, బెల్ కొట్టినా ఎవరూ రావడం లేదని చివరకు సంతోష్ కూడా సెలవుపెట్టిపోయాడంట అని సెటైర్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ కొనసాగుతోందని, ఇప్పుడు మాట్లాడటం భావ్యం కాదని ముఖ్యమంత్రి అన్నారు. అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాతే మాట్లాడుతానని సీఎం స్పష్టం చేశారు.
Read More...
రూ.2 లక్షల రుణమాఫీ ఎఫెక్ట్.. మరో దేవతపై ఒట్టేసిన సీఎం రేవంత్..!