- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్రేకింగ్ : రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. ఇంటి వద్ద హై టెన్షన్
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ శుక్రవారం నిరుద్యోగ మహాదీక్షకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి రేవంత్ రెడ్డి ఇప్పటికే మద్దతు ప్రకటించారు. కాగా, దీక్షకు అనుమతి లేదని వర్సిటీలో విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. రెండు వైపుల ఉన్న గేట్లను మూసివేసి పలువురు విద్యార్థి నేతలను అరెస్ట్ చేసారు.
మరోవైపు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి పొద్దున్నే చేరుకున్న పోలీసులు ఆయనను గృహ నిర్భంధంలో ఉంచారు. రేవంత్ ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. రేవంత్ ఇంటి వైపు వెళ్లకుండా కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేసారు.
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుంటే కనీసం నిరసన వ్యక్తం చేయ్యనివ్వరా? అంటూ మండిపడ్డారు. అనంతరం ట్విట్టర్‌లో రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ లకు సవాల్ విసిరారు. ‘దమ్ముంటే కెసిఆర్, కేటీర్‌లు ఉస్మానియా విద్యార్థుల ముందు ప్రశ్నపత్రాల కుంభకోణంపై చర్చకు రావాలి. మీరు సచ్చిలురైతే, స్కాంలో మీ పాత్ర లేకపోతే నా సవాల్‌ని స్వీకరించాలి.’ అన్నారు.
ఇవి కూడా చదవండి: విద్యార్థి నిరుద్యోగ మార్చ్‌ను అడ్డుకున్న ఓయూ పోలీసులు.. పలువురు అరెస్ట్