- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి కేబినెట్.. ఏ జిల్లా నుంచి ఎంత మంది మంత్రులంటే
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఈ రోజు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు అధికారులు ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనే ప్రశ్న నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం రేవంత్ రెడ్డి తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల లిస్ట్‌ను గవర్నర్ తమిళిసై కి పంపించారు. ఈ లిస్టులో డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కకు స్థానం దక్కగా.. ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి, తుమ్ముల, నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి అవకాశం దక్కింది.
అలాగే వరంగల్ నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలైన సీతక్క, కొండా సురేఖలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి జూపల్లీకి స్థానం దక్కగా, ఉమ్మడి కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులకు చోటు కల్పించారు. మెదక్ నుంచి దామోదర రాజనర్సింహ, అలాగే ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి కి స్థానం దక్కింది. కాగా గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల నుంచి మొదటి లిస్ట్‌లో ఒక్కరికి కూడా స్థానం దక్కలేదు.