High Court: హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఊరట

by Prasad Jukanti |
High Court: హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఊరట
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యుత్ కొనుగోళ్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. విద్యుత్ కొనుగోలు బిడ్డింగ్ లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్ డీసీ) ను ఆదేశించింది. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం రూ.261 కోట్లు చెల్లించాల్సి ఉందని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎన్ ఎల్ డీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో తెలంగాణ డిస్కమ్ లు విద్యుత్ కొనుగోలు బిడ్ లో పాల్గొనకుండా ఎన్ ఎల్ డీసీ అడ్డుకుంది. గురువారం ఉదయం నుంచి విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్చేంజీలు నిలిపివేశాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ బిడ్డింగ్ కు అనుమతి ఇవ్వాలని ఎన్ఎల్ డీసీకి మధ్యంతర ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed