పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. నేడే నియామక పత్రాలు అందజేత

by GSrikanth |   ( Updated:2024-02-14 00:00:35.0  )
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. నేడే నియామక పత్రాలు అందజేత
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం 15,441 మందికి పోలీస్ ఉద్యోగాలు ఇవ్వనున్నది. ఎల్బీ స్డేడియం వేదికగా అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. ఇందులో పోలీస్, స్పెషల్ ప్రోటెక్షన్ ఫోర్స్, ట్రాన్స్ పోర్ట్, ప్రొహిబిషన్, ఎక్సైజ్, ఫైర్, జైళ్ల శాఖ, సంక్షేమ విద్యాసంస్థల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. క్వాలిఫై అయిన అభ్యర్థులను జిల్లాలు వారీగా ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. బుధవారం అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చే కార్యక్రామానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్​గెస్ట్‌గా హాజరు కానున్నారు. కోర్టు సమస్యలను అధిగమించి ఉద్యోగాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కావడంతో నిరుద్యోగుల్లో సంబురాలు మొదలయ్యాయి.

Advertisement

Next Story