- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రవిప్రకాశ్ RTVకి లీగల్ చిక్కులు..
దిశ, తెలంగాణ బ్యూరో: సీనియర్ జర్నలిస్టు రవి ప్రకాశ్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు ప్రచారంలో ఉన్న ఆర్‌టీవీ (రాయుడు విజన్ మీడియా లిమిటెడ్)కు ట్రేడ్‌మార్కు లీగల్ చిక్కులు ఎదురయ్యాయి. అర్నబ్ గోస్వామి ఆధ్వర్యంలోని రిపబ్లిక్ టీవీ (ఏఆర్జీ ఔట్‌లియర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్) తరఫున ముంబై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 4వ తేదీన వాదనలు ముగిశాయి. రిపబ్లిక్ టీవీ లోగోను పోలినట్లుగా ఆర్‌టీవీ లోగో ఉన్నదని, ఇది చట్ట ఉల్లంఘన మాత్రమే కాక తమ సంస్థకు నష్టం కలిగించేదిగా ఉన్నదని ఆ పిటిషన్‌లో యాజమాన్యం పేర్కొన్నది.
ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆర్‌టీవీ పేరుతో యూ ట్యూబ్ చానెల్‌ను కూడా ఓపెన్ చేశామని, ఆ తర్వాత ఉనికిలోకి వచ్చిన ఆర్‌టీవీ (రాయుడు విజన్) ఇదే పేరును వాడుతూ ఉన్నదని పేర్కొన్నది. నష్టం కలిగించినందున రూ. 100 కోట్ల మేర దావా వేసింది. ఆర్‌టీవీ లోగోను, మూడు అక్షరాలను తొలగించాలని ఆ పిటిషన్‌లో కోర్టును కోరింది. ఈ పిటిషన్‌ను అత్యవసరమైనదిగా భావించి విచారణ చేపట్టాలని, మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయాలని జస్టిస్ మనీష్ పిటాలే నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్‌ను రిపబ్లిక్ టీవీ యాజమాన్యం కోరింది. దీనికి నిరాకరించిన జడ్జి.. కేంద్ర ఇన్ఫర్మేషన్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వశాఖ నుంచి ఇప్పటికే ఆర్‌టీవీ అనుమతి కోరిందని, ఒక దరఖాస్తు ఆ శాఖ దగ్గర పరిశీలనలో ఉన్నదని పేర్కొని తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేశారు.
ఆర్‌టీవీ తరఫున న్యాయవాదులు శరణ్ జగ్‌తియాని, హీరేన్ కామోద్ తదితరులు వాదిస్తూ... తమ తరపున దాఖలు చేసిన దరఖాస్తు కేంద్ర మంత్రిత్వశాఖ దగ్గర పెండింగ్‌లో ఉన్నదని, రిపబ్లిక్ టీవీ తరపున లోగో విషయమై దాఖలైన పిటిషన్‌పై ఇంకా పరిశీలన జరుగుతూ ఉన్నదని, ప్రస్తుతం మంత్రిత్వశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇంకా ఆర్‌టీవీ ప్రసారాలు మొదలుకాలేదని, శాటిలైట్ టీవీ ఛానెల్‌లో లోగో డిస్‌ప్లే కావడంలేదని వివరించారు. తదుపరి విచారణ జూన్ 5న జరగనున్నందున ఈ లోపు అత్యవసరమైన విచారణ అవసరమని రెండు పక్షాలు భావించినట్లయితే మరోసారి కోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావచ్చని తెలిపారు.