- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంచిరెడ్డి కిషన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి : కేసీఆర్
దిశ, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ మంగళవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గేటు వద్ద ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగలేదని, ఎన్నికలు వచ్చినాయి అంటే అన్ని పార్టీలు ఒకటే హడావిడి జరుగుతుందని, ప్రజలు ఎన్నికలు జరుగుతున్నప్పుడు అభ్యర్థి యొక్క గుణగణాలు ఆలోచించాలని, పార్టీల విషయంలో కూడా గ్రామస్థాయిలో ప్రజలు చర్చించి ఓట్లు వేయాలి. ఐదు సంవత్సరాలు మీరు వేసే ఓటు పనిచేస్తుందని కాబట్టి పార్టీల చరిత్ర కూడా ఆలోచించాలి, బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ కోసమేనని, మనం ఎన్ని సమస్యలు చూశాం తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు నెలలు కష్టపడి ఆలోచించి ఒక ప్రణాళిక బద్ధంగా తెలంగాణను అభివృద్ధి చేశాం. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ కాంగ్రెస్ హయాంలో వందల రూపాయల్లో ఉంటే దానిని వేలలోకి మార్చిన చరిత్ర భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు.
రాష్ట్రంలో ఒక వెయ్యి 18 గురుకుల కళాశాలలు ఏర్పాటు చేశామని, అందుబాటులో మీరు ఖాన్ పేట గ్రామంలో మెడికల్ కాలేజీ వచ్చిందని, రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని, తలసరి విద్యుత్ వాడకం 1100 యూనిట్ల నుండి 2200 యూనిట్స్ పెరిగింది. ఇబ్రహీంపట్నంలో చెరువులోకి నీరు రావాలని 36 కిలోమీటర్ల నాలాను అభివృద్ధి చేస్తే చెరువులోకి నీరు వచ్చిందని, పాలమూరు ఎత్తిపోతల పథకం పై కేసులన్నీ ఎత్తివేయడం జరిగిందని, త్వరలోనే మునుగోడు శివన్నగూడ నుండి లక్ష ఎకరాలకు నియోజకవర్గంలోని రైతులకు నీరు అందించడం జరుగుతుంది. ధరణి పోర్టల్ తీసుకురావడంతో రైతులకు భూమి మీద అధికారం, రైతు బంధు ద్వారా రానున్న రోజుల్లో 16 వేల రూపాయలు ఎకరాకు అందించడం జరుగుతుంది. కంటి వెలుగు ద్వారా రాష్ట్రంలో 3 కోట్ల మందికి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఇబ్రహీంపట్నంలో ఫాక్స్ కాన్ కంపెనీ ద్వారా రానున్న రోజుల్లో లక్ష మందికి ఉద్యోగాలు, దళిత బంధులో నియోజకవర్గానికి ప్రథమ పాత్ర ఉంటుందని తెలిపారు. మంచిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం వల్ల ఇబ్రహీంపట్నం నియోజకవర్గంని 2 వేల 931 కోట్లతో అభివృద్ధి చేశామని, నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీని గెలిపించవలసిన అవసరం ఉందని, నియోజకవర్గంలో మేము కూడా ప్రచారంలో భాగంగా ఊర్లలోకి వెళ్ళినప్పుడు ప్రజలు మాకు మద్దతు పలుకుతున్నారు. శివన్నగూడ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులకు నీరు అందజేయడం, కొంగరకలాల్ వరకు మెట్రో లైన్ పోడిగింపు, జాపాల రంగాపూర్‌లో 200 ఎకరాలలో ఐటీఐ, పీజీ కళాశాలలు ఇవ్వాలని, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించాలని విన్నపించారు. ఇబ్రహీంపట్నం కి పెద్ద ఎత్తున సాఫ్ట్ వేర్ కంపెనీలు రావాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా ఈ విషయాలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జెడ్పి చైర్మన్ తీగల అనిత రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సత్తు వెంకట రమణారెడ్డి, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, ఎంపీపీ కృపేష్, నర్మదా, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.