భారీ వర్షాలు..నీట మునిగిన లింగంపల్లి రైల్వే బ్రిడ్జి

by samatah |
భారీ వర్షాలు..నీట మునిగిన లింగంపల్లి రైల్వే బ్రిడ్జి
X

దిశ, శేరిలింగంపల్లి : రాత్రి నుండి కురిసిన వర్షానికి శేరిలింగంపల్లి డివిజన్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థానికులు. పలు ఇళ్లలోకి నీరు చేరడంతో గృహోపకరణాలు, సామాగ్రి పూర్తిగా నీట మునిగింది. అలాగే లింగంపల్లి రైల్వే బ్రిడ్జీ వద్ద భారీగా నీరు చేరడంతో గచ్చిబౌలి, లింగంపల్లి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉద్యోగస్తులు, సాధారణ ప్రయాణీకులు ఆవైపు నుండి వెళ్లేందుకు అవకాశం లేక పోవడంతో లింగంపల్లి మార్కెట్, నలగండ్ల ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి వస్తుంది. దీంతో ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అలాగే పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జీహెచ్ఎంసీ ఏమర్జెన్సీ టీమ్ లు రంగంలోకి దిగి నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Next Story