- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఛార్జిషీటు అంశంపై కాంగ్రెస్ నిరసనలు.. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ కౌంటర్

దిశ, వెబ్‌డెస్క్: ‘నేషనల్ హెరాల్డ్’ (National Herald) మనీ లాండరింగ్ (Money Laundering) వ్యవహారంలో ఈడీ (ED) తాజాగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా పలువురి పేర్లను ఛార్జిషీటులో చేర్చింది. అదేవిధంగా కేసుతో లింక్ అయి ఉన్న ఆస్తుల స్వాధీనానికి అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘నేషనల్ హెరాల్డ్’ కేసు ఛార్జిషీట్‌లో రాహుల్, సోనియా గాంధీ పేర్లు చేర్చడంపై ఏఐసీసీ (AICC) దేశవ్యాప్తంగా నిరసనకు పిలపునిచ్చింది. ఇవాళ అన్ని రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టాలని దిశానిర్దేశం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుని ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని పలువురు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రతిపక్షాలపై కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. చార్జిషిటలో తమ పార్టీ అధినేతల పేర్లు తొలగించేంద వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
అయితే, కాంగ్రెస్ నిరసనలపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ (Ravishankar Prasad) కౌంటర్ ఇచ్చారు. నేషనల్ హెరాల్డ్ (National Herald) కేసులో చట్టం తన పని తాను చేసుకెళ్తోందని కామెంట్ చేశారు. రూ.వేల కోట్ల విలువైన ప్రాపర్టీలను క్రట్ర చేసి చట్టవిరుద్ధంగా కబ్జాకు ప్రయత్నిస్తే అది సరైందేనా అని కాంగ్రెస్ (Congress) నేతలను ప్రశ్నించారు. గాంధీలు ఓ వార్తా పత్రికను ప్రైవేట్ ఏటీఎం (Private ATM)గా మార్చారని ఫైర్ అయ్యారు. హస్తం పార్టీ నిరసనలు చేపట్టి తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి నిరసన తెలిపే హక్కు ఉందని, కానీ ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసి నేషనల్ హెరాల్డ్‌కు ఇచ్చే హక్కు వారికి లేదని అన్నారు.
ఢిల్లీ (Delhi)లోని బహదూర్ షా జాఫర్ మార్గ్ నుంచి ముంబై, లక్నో, భోపాల్, పాట్నా వరకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రజా ఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ (Young India Limited) పేరుతో గాంధీ కుటుంబం చేతుల్లోకి బదిలీ చేసేందుకు కార్పొరేట్ కుట్రకు తెగబడ్డారని ఆరోపించారు. ‘యంగ్ ఇండియా’ ఒక స్వచ్ఛంద సంస్థగా ఉండాల్సింది పోయి రూ.వేల కోట్లను వెనకేసుకుందని రవిశంకర్ ప్రసాద్ ధ్వజమెత్తారు.