బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు

by Anjali |   ( Updated:2023-06-06 03:53:45.0  )
బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు
X

దిశ, బషీరాబాద్: బషీరాబాద్ మండల పరిధిలోని గొట్టిగ కుర్దు, రెడ్డి ఘనపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింగ్ రావు, వీర్య నాయక్ ఆధ్వర్యంలో సోమవారం నాడు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గొట్టిగా కుర్దు, కంసాన్‌పల్లి ( ఎం) గ్రామాలల్లో ఇంటింటికి తిరిగి బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్య బోధన జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ, విద్య కమిటి చైర్మన్ నాగమణి, గ్రామ పెద్దలు రామకృష్ణ,ఉపాధ్యాయులు చెంద్రశేకర్,రవికాంత్, రవికుమార్,అనసూయా, సరిత ,విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story