అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

by S Gopi |   ( Updated:2023-03-04 08:36:34.0  )
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
X

దిశ, పరిగి: అనుమానాస్పద స్థితిలో కేవశరెడ్డి రెసిడెన్సియల్ పాఠశాలలో విద్యార్థి మృతిచెందాడు. స్థానికులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో మెయినాబాద్ మండలం చిన్న మంగళారం గ్రామానికి చెందిన కార్తీక్(8) 3వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడంటూ పాఠశాల సిబ్బంది తల్లి దండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు కార్తీక్ ను వెంటనే నగరంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తుండగా శుక్రవారం మృతిచెందాడు. దీంతో తన కుమారుడిని పాఠశాల ఉపాధ్యాయులు కొట్టడం వల్లే మృతిచెందినట్లు పూడూరు మండలం చన్గొముల్​పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పూడూరు మండలం కేశవరెడ్డి రెసిడెన్షియల్​పాఠశాల ముందు ధర్నాకు దిగారు.

విద్యార్థి మృతికి గల కారణాలను తెలుసుకుని బాధిత కుటుంబీకులు న్యాయం చేయాలని డిమాండ్​చేశారు. పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐ విఠల్​రెడ్డి తన సిబ్బందితో కలిసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పాఠశాల యాజమాన్యం బెడ్ పై నుంచి కిందపడటంతో అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించి పంపించామని చెబుతున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పరిగి డీఎస్పీ కరుణా సాగర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబీకులను సముదాయించి సంఘటనకు గల కారణాలను పూర్తిగా విచారించి పాఠశాల వారిదే తప్పిదం అయితే చట్ట పరమైనచర్యలు తీసుకుని మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.

Advertisement

Next Story

Most Viewed