ముగిసిన రాష్ట్రస్థాయి టెలికాయిట్ పోటీలు..

by Sumithra |
ముగిసిన రాష్ట్రస్థాయి టెలికాయిట్ పోటీలు..
X

దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలాన్ని చెందిన వెల్జల్ గ్రామంలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన టెన్నికాయిట్ పోటీలు ఘనంగా విజయవంతమయ్యాయి. ఈ పోటీలకు 22 జిల్లాల నుండి 12 మంది చొప్పున హాజరు కాగా హైదరాబాద్, ఖమ్మం, నిజాంబాద్ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ముగింపు సమావేశాలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తలకొండపల్లి మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథులుగా హాజరై ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ టెన్నికాట్ ప్రధాన కార్యదర్శి యాదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి శ్యాంసుందర్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని వారన్నారు.

రానున్న రోజుల్లో వెల్జాల్ గ్రామంలో పెద్దఎత్తున క్రీడా పోటీలకు వేదికగా చేస్తామని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రతి ఆటలో గెలుపోటములు సర్వసాధారణమని క్రీడాకారులు సమయస్ఫూర్తితో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని అప్పుడే మనకు గౌరవం లభిస్తుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సౌత్ ఆఫ్రికాలో జరిగే టెలికాయిట్ కు ఎంపికైన నిజాంబాద్ జిల్లాకు చెందిన త్రిషని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన త్రిష అంతర్జాతీయ స్థాయిలో గెలుపొంది మన రాష్ట్రానికి కన్న తల్లిదండ్రులకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జాతీయ టెన్నికైడ్ ప్రధాన కార్యదర్శి యాదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.శ్యామ్ సుందర్, జిల్లా చైర్మన్ చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా కో ఆప్షన్ నెంబర్ రహమాన్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసమూర్తి, ఉపసర్పంచ్ అజీజ్, ఎంపీటీసీ అంబాజీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed